డిజిటల్ సాంకేతికతను విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలి
ఐటిడిఏ పిఓ బి.రాహుల్
పాల్వంచ, (విజయక్రాంతి): డిజిటల్ ప్రకటనల రూపకల్పన ఆన్లైన్ వేదికల ద్వారా మార్కెటింగ్ నిర్వహించే విధానాల వంటి అంశాలను విద్యార్థినిలకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు.
బుధవారం పాల్వంచలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల బాలికల కళాశాలలో విద్యార్థులకు ఐటిడిఎ తరుపున డిజిటల్ మార్కెటింగ్ , సైబర్ సెక్యూరిటీపై నిర్వహిస్తున్న 100 రోజుల శిక్షణ తరగతులను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ తరగతుల నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులతో స్వయంగా ముచ్చటించి శిక్షణ ద్వారా వారు పొందుతున్న అవగశిక్ష తెలుసుకున్నారు.సైబర్ సెక్యూరిటీలో భాగంగా మొబైల్ ఫోన్‌ను సురక్షితంగా వినియోగించడం, వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ నుంచి రక్షణ పొందే విధానాలు, డిజిటల్ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని,
అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా వెబ్‌సైట్ డిజైన్, డిజిటల్ ప్రకటనల రూపకల్పన (Ad Design), ఆన్లైన్ వేదికల ద్వారా మార్కెటింగ్ నిర్వహించే విధానాలు వంటి అంశాలపై విద్యార్థులకు ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నామని ఇన్స్ట్రక్టర్లు l కు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్సిఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ పి.అనురాధ మరియు ఫ్యాకల్టీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.