జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్‌కు సన్మానం

07-10-2026 | 07:54pm

మేడిపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎల్. సత్యప్రసాద్‌(Satyaprasad)ను పీఆర్టియూ టీఎస్ మేడిపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. స్థానిక మేడిపల్లి పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ సందర్భంగా పీఆర్టీయూ మేడిపల్లి మండల నాయకులు మాట్లాడుతూ... సత్యప్రసాద్ గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వడం సంతోషకరమని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో పీఆర్టియూ మండల అధ్యక్షుడు ఇ. వెంకట్ రెడ్డి, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, భాస్కర్, మండల బాధ్యులు భూపాల్ రెడ్డి, మాధవి, బాలరాజ్, అరుణ, లావణ్య, జబ్బార్, వెంకట్, అనురాధ, ప్రపూర్ణ, సజిత, భారతి, హరిచంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు