కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానరాని డాక్టర్!

21-10-2026 | 02:39pm

గత మూడు రోజుల నుండి పీహెచ్ సి చుట్టు ప్రదక్షిణాలు ..

నిండు బాలింత డ్రెస్సింగ్ కోసం పడిగాపులు.

కాళేశ్వరం, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Kaleshwaram Primary Health Centre) పిహెచ్ సి లో వైద్యుల నిర్లక్ష్యం(Medical negligence) తారాస్థాయికి చేరింది. గత మూడు రోజులుగా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు(Patients) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 12వ వార్డు మెంబర్ బొల్లం రాజశేఖర్(Bollam Rajashekhar) తెలిపారు. కాళేశ్వరం(Kaleshwaram) చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ పీహెచ్సీకి వస్తే వైద్యులు లేకపోవడంతో రోగులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్తున్నారు.

ముఖ్యంగా ఒక నిండు బాలింత డ్రెస్సింగ్(Postpartum dressing) కోసం మూడు రోజులుగా పీహెచ్సీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన లేకపోవడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానికంగా డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు