ఉన్నత విద్యా వ్యవస్థను... బలోపితం చేయడమే వర్క్ షాప్ లక్ష్యం

14-10-2026 | 08:43pm
  1. విద్య దృక్పదాల శిక్షణ లీడ్ పరంపర అకాడమిక్స్ ప్రోగ్రాం                        
  2. ఘనంగా బిట్స్ పిలానీలో లీడ్ అకాడమిక్ మిక్స్ ప్రోగ్రాం.            

జవహర్ నగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): భారతదేశ ఉన్నత విద్యారంగంలో నాయకత్వ సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా బిట్స్ పిలాని(BITS Pilani) హైదరాబాద్ క్యాంపస్ లోని సెంటర్ ఫర్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్ డెవలప్మెంట్(Centre for Leadership in Education and Academic Development) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది అక్టోబర్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు క్యాంపస్ లో జరిగే ఈ ప్రత్యేక శిక్షణ లో విదేశీ,

దేశవ్యాప్తంగా దుబాయ్ నుండి ఎంపికైన 15 మంది విద్యాసంస్థలకు చెందిన 31 మంది విద్య నాయకులు పాల్గొంటున్నారు. లీడ్ అకాడమిక్ ప్రోగ్రాం ద్వారా విద్యావేత్తలను తీర్చిదిద్దడంలో బిట్స్ పిలానీ పాత్ర అమోఘమని ఉన్నత విద్యా వ్యవస్థను బలోపితం చేయడమే లక్ష్యంగా మూడు రోజుల వర్క్ షాప్ ని బిట్స్ పిలానీలో ఘనంగా ప్రారంభించారు.

లీడ్ అకాడమిక్ ప్రోగ్రాం ద్వారా విద్యావేత్తలను తీర్చిదిద్దడంలో బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ ముందంజలో ఉందని భారతదేశం ఉన్నత విద్యా వ్యవస్థ అంతట నాయకత్వ సామర్థ్యాలను బలోపితం చేయడానికి మూడు రోజుల సమగ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని బిట్స్ పిలాని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి 15 సంస్థలకు చెందిన 31 మంది విద్యావేత్తలను ఒకే చోట వేదిక అవుతుందని, ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని బిట్స్ పిలానీలో అక్టోబర్ 14వ తేదీ నుండి మొదలవుతుందని అన్నారు. భారత దేశ ఉన్నత విద్యా వ్యవస్థ అంతటా నాయకత్వ సామర్థ్యాలను బలోపితం చేయడంలో చురకైన పాత్ర పోషిస్తూ ఉన్నత విద్యా సంస్థలకు నాయకత్వం వహించడానికి అవసరమైన నైపుణ్యాలు దృక్పథాలతో విద్యా నిర్వహకులను సన్నద్ధం చేయడానికి రూపొందించిన కార్యక్రమమే లీడ్ అకాడమిక్ మిక్స్ ప్రోగ్రాం అని తెలిపారు.

విద్య నాయకులను అభివృద్ధి చేసే ప్రయత్నాలకు బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ నాయకత్వం వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు మూడు రోజులపాటు బిట్స్ పిలాని క్యాంపస్లో జరగనున్న ఈ కార్యక్రమానికి భారతదేశం దుబాయ్ నుండి వచ్చిన దరఖాస్తుల నుండి ఎంపిక చేయబడిన 15 సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 31 మంది విద్య మేధావులను ఒకే చోట వేదికగా చేర్చడం ముదాబావమన్నారు.

బిట్స్ పిలానీలోని సెంటర్ ఫర్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎకడమిక్ డెవలప్మెంట్ లీడ్ చేపట్టిన ఈ కార్యక్రమం వికసిత భారత్ 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా భారతదేశంలో ఉన్నత విద్య పూర్వక అభివృద్ధికి దోహద పడగలదని విద్యా నాయకులను అభివృద్ధి చేయాలనే సంస్థ యొక్క ఉద్దేశమన్నారు.

దీనికి మొదటి రెండు బ్యాచ్ లలో 74 మంది విద్యావేత్తలు పాల్గొనగా ఈ కార్యక్రమం తన మూడో బ్యాచ్ ద్వారా వివిధ సంస్థలలో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం అక్టోబర్ 13న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిట్స్ పిలానీ గ్రూప్  వైస్ ఛాన్సర్ ప్రొఫెసర్ వి .రంగ గోపాలరావు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి లీడ్ ఎకనామిక్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి. శంకర్ గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శంకర్ గణేష్ మాట్లాడుతూ సంస్థలను బలోపితం చేయడంలో  నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రొఫెసర్ బి. రాంగోపాల్రావు మాట్లాడుతూ అకాడమిక్ లీడర్షిప్ వ్యక్తుల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా శ్రేష్టత నిలబెట్టే సంస్థలను నిర్మించడం ముఖ్యమైనది అన్నారు.

భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖలో సీనియర్ విద్యా విధాన నిపుణురాలు మాజీ ప్రత్యేక అధికారిని షమ్స్ మాట్లాడుతూ సంస్కాగత శ్రేష్టత సమ్మిళిత నాయకత్వం మానసిక భద్రత ఆధ్యాపకుల శ్రేయస్సు కోసం విద్యావృత్తిని పునర్ సృష్టించడంపై మాట్లాడారు. అనంతరం శ్రీ ఆర్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉత్తేజకరమైన క్యాంపస్లను సృష్టించడం ద్వారా విద్యార్థుల భాగస్వామ్యం గురించి విద్యార్థి కేంద్రీకృత క్యాంపస్ వాతావరణ ప్రాముఖ్యతను వివరించారు.

అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విద్యావేత్తలు ప్రొఫెసర్లు సాంస్కృతి పరిపాలన అంశాల గురించి మాట్లాడారు. విద్యా ప్రమాణాలను ప్రభావితం చేసే అకాడమిక్ నిర్వాహకుల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం ద్వారా బిట్స్ పిలాని ఉన్నత విద్యకు తన సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు, ప్రొఫెసర్లు, అక్కడ మీకు కౌన్సిలర్లు, విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు