విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

27-11-2026 | 11:19pm

జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో తనిఖీలు

భూపాలపల్లి, నవంబర్ 27 విజయ క్రాంతి: విద్యార్థులకు(Students') నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్ అన్నారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్ శుక్రవారం మేడిపల్లి, మహదేవపూర్, కాళేశ్వరంలోని(Mahadevpur, Kaleshwaram) మూడు గిరిజన సంక్షేమ పాఠశాలలను తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, తాగునీరు, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని, పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

మరిన్ని వార్తలు