చేగుంటలో ఉమ్మడి జిల్లా స్థాయి ఫెన్సింగ్ క్రీడలు
చేగుంట నవంబర్ 27,విజయక్రాంతి : చేగుంట మండల(Chegunta Mandal) కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College) శనివారం రోజున అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలు(Fencing competitions for boys and girls) నిర్వహిస్తున్నట్లు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల(Medak, Sangareddy, and Siddipet districts) కార్యనిర్వాహక కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస్,భాస్కర్ రెడ్డి, సమ్మయ్య, గణపతి, కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ ఒక సంయుక్త ప్రకటన తెలిపారు. ఈ పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, క్రీడాకారిణిలు తమ వెంట ఒరిజినల్ బోనాఫైడ్ సర్టిఫికెట్, పెన్ నెంబర్, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ప్రీవియస్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డు తమ వెంట తీసుకొని రావాలని వారు తెలిపారు.
అండర్ 14 పోటీల్లో పాల్గొని క్రీడాకారులు 01-01-2013 తర్వాత జన్మించిన వారై ఉండాలని, అండర్ 17 పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 01-01-2010 తర్వాత జన్మించిన వారై ఉండాలని, అండర్ 19 పోటీలలో పాల్గొనేవారు 01-01-2008 తరువాత జన్మించిన వారై ఉండాలని వారు తెలిపారు. క్రీడాకారులు క్రీడాకారిణిలు ఎవరి భోజనం వారే తమ వెంట తీసుకురావాలని వారు కోరారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు,క్రీడాకారిణిలు కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని పాఠశాలలో డిసెంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు. పూర్తి వివరాలకు కోచ్ కరణం గణేష్ రవికుమార్, ప్రవీణ్ కుమార్ పీడీ 9666632023, 9573296678, 94409977883 సంప్రదించాలని వారు కోరారు.