రెడ్‌క్రాస్ సేవల విస్తరించి మెరుగైన ఆరోగ్య సేవలందించాలి
27-11-2026 | 11:21pm
కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, నవంబర్ 27 (విజయ క్రాంతి): రెడ్‌క్రాస్ సేవలను(Red Cross services) విస్తరించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించాలని కలెక్టర్ చంద్రశేఖర్(Collector Chandrashekhar) సూచించారు. నూతన జిల్లా చైర్మన్ డాక్టర్ హేమలతను అభినందించారు. రక్తదాన శిబిరాలు(Blood donation camps), బ్లడ్ బ్యాంక్ సేవల(blood bank services) బలోపేతం, రక్తహీనత నివారణ, యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు, భాషా శిక్షణపై కూడా వివరించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.