ఎన్నికల హామీలను తుంగలో తొక్కేశారు
మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి
బెల్లంపల్లి: కాంగ్రెసు పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచాక తుంగలో తొక్కేశారనీ బీజేపీ(BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి(Amurajula Sridevi) అన్నారు. భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధార కళ్యాణి అధ్యక్షతన పట్టణ పదాధికారుల సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజులలో ప్రతి సమస్య మీద భారతీయ జనతాపార్టీ పోరాడుతుందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని శక్తి కేంద్రాలకు శక్తి కేంద్ర ఇన్చార్జిలను నియమించడం జరిగిందనీ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పట్టణ ఇంచార్జీ శైలేందర్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయలు, మహిళా మోర్చ నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ నల్లుల సంగీత, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు దూది ప్రకాష్, జిదుల రాములు, జిల్లాఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కోడి సురేష్, ఎరుకల నర్సింగ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు నిట్ట అరుణాసుందరి,జిల్లా బీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు గాండ్ల మహేష్, సల్లం సుమలత, భాగమోహన్ ,పుల్లూరి రాము భాష బోయిన యుగేందర్, పట్టణ కార్యదర్శులు కనకం శ్రీనివాస్ ,అల్లకాటి మహేష్, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు తోటపల్లి ఓం సాయి, ఎస్టిమోర్చా అధ్యక్షులు సుధాకర్ ,పట్టణ బిసి మోర్చా అధ్యక్షులు మల్లేష్, మహిళా మోర్చా అధ్యక్షులు లావణ్య, కళ్ళపెళ్లి నవీన్, గీస రాములు, సత్తన్న కోదాటి కళావతి చంద్రమౌళి పాల్గొన్నారు.