"పిల్లల ప్రజావాణి" కార్యక్రమం
మహబూబాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర(Telangana State Commission)బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (Protection of Child Rights) ఆదేశాల మేరకు, మహబూబాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని గ్రీవెన్స్ హాల్ నందు ఈ నెల 16న సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రత్యేకంగా "పిల్లల ప్రజావాణి" కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలల హక్కులు, రక్షణ, భద్రత, విద్య, ఆరోగ్యం, పోషకాహారం మరియు సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. బాలలు తమకు ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి.
సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారన్నారు. కావున, జిల్లాలోని బాలలు తమ సమస్యలు , ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.