ఎల్నినో ప్రభావాలపై ప్రజలకు అవగాహన
మహాదేవపూర్ /కాళేశ్వరం. అక్టోబర్ 28.(విజయక్రాంతి ) : ఎల్ నినో ప్రభావాలపై(El Nino effect) తెలంగాణా సాంసృతిక కళాకారుల బృందం ప్రజలకు అవగాహన కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) , జిల్లా ప్రజాసంబంధాల అధికారి (డీపీఆర్ఓ) శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి(Cultural Vanguard of Telangana) ఆధ్వర్యంలో మహాదేవపూర్ మండల(Mahadevpur Mandal) కేంద్రంలో బుధవారం సెగ్గం శిరీష కళాబృందం(Seggam Sirisha Cultural Troupe) ఎల్నినో ప్రభావాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాకారులు తమ పాటలు, మాటలు, కళారూపాల ద్వారా ఎల్నినో కారణంగా వాతావరణంలో సంభవించే మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో అనిశ్చితి, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల గురించి ప్రజలకు వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.
రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని కళాకారులు తమ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ప్రజలు ఎల్నినో ప్రభావాలపై అవగాహన పెంచుకొని, ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా జానపద గీతాలు, కళారూపాల ద్వారా సామాజిక అవగాహన కల్పించడం తెలంగాణ సాంస్కృతిక సారథి లక్ష్యమన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కళాబృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కళాకారులుసెగ్గం శిరీష, గడ్డం నాగమణి.కాస స్వాతి. ఆత్మకూరి మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్, ఓనపాకల కుమార్, చిలుముల మధుబాబు, పాల్గోన్నారు.