అల్లం నారాయణ మాతృమూర్తి బుచ్చమ్మ మృతి

12-11-2026 | 09:25pm

పరామర్శించిన టీయూడబ్ల్యూజే (143) నాయకులు..

భూపాలపల్లి మహాదేవపూర్ నవంబర్ 12 విజయ క్రాంతి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లిలో టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్(Former Press Academy Chairman) అల్లం నారాయణ మాతృమూర్తి అల్లం బుచ్చమ్మ గారు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు గాజులపల్లికి చేరుకుని అల్లం నారాయణను పరామర్శించారు.

ఈ సందర్భంగా బుచ్చమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాతృమూర్తిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ అల్లం నారాయణకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజు నారాయణ, రామారావు, వెంకటేష్, రామ్‌రెడ్డి, నరేష్, షేక్ దిన్ తదితరులు పాల్గొని అల్లం నారాయణను పరామర్శించారు.

మరిన్ని వార్తలు