అన్నపూర్ణ సేవా రథం పోస్టర్ ఆవిష్కరణ
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి): అన్నపూర్ణ సేవా రథం ప్రచార పోస్టర్ల ను గురువారం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(State PCC President Mahesh Kumar Goud) ఆవిష్కరించారు. కామారెడ్డికి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవా రథం ప్రారంభిస్తున్న సందర్భంగా గురువారం నిజామాబాదులో పోస్టర్ల ను అవిష్కరించారు.
ఈ సందర్భంగా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆయన అభినందించారు. అన్నపూర్ణ సేవ పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబంలోని ఆప్తులు కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చి బంధుమిత్రులకు భోజనం ఏర్పాట్లు ఈ రథం ద్వారా చేస్తున్నారు.
సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తే ఈ సేవ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం హిందూ ప్రియ, డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరు సుధాకర్, తాటి ప్రసాద్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్ జమీల్ అహ్మద్, సలీం, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, రంగ రమేష్ గౌడ్, కామారెడ్డి నియోజకవర్గం యంగ్ బ్రిగేట్ యూత్ అధ్యక్షులు నర్సిల్ల మహేష్, సునీల్ గౌడ్, బండారి శ్రీకాంత్, అరవింద్, బల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.