రైతు చేతిలోనే నేల ఆరోగ్యం

03-11-2026 | 05:00pm

పాలెం కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డా. ఓ.శైల

బిజినేపల్లి, నవంబర్ 03: అంతర పంటలు, పంట మార్పిడి, ఎరువుల యాజమాన్యం వంటి పద్ధతులతోనే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ముఖ్యంగా నేల ఆరోగ్యం రైతు చేతుల్లోనే ఉందని పాలెం కే.వీ.కే సీనియర్ శాస్త్రవేత్త డా. ఓ.శైల(Dr Shaila) అన్నారు. వరి సాగు తర్వాత చిరుదాన్యాల సాగును చేపట్టినట్లైతే నేల ఆరోగ్యంగా ఉంటుందని, అందుకు మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్నారు. మంగళవారం మండలంలోని పాలెం కే.వి.కే ప్రాంగణంలో నేల సంరక్షణ ప్రచార కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సదస్సులో శాస్త్రవేత్తలు డా.శ్రీవిధ్య, డా.సుమన్ డా.జీ.ఈశ్వర్ రెడ్డి,  డా.చిరంజీవి, డా వీ. దివ్యారాణిలు మాట్లాడుతూ నేలలో కృత్రిమ ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులు ఉపయోగించాలని, భూసార పరీక్షల అనంతరం అధికారులు సూచించిన మేర మాత్రమే కృత్రిమ ఎరువులు వాడాలన్నారు. వేసవిలో నేలను లోతుగా కలియ దున్నాలని, పంట వ్యర్థాలను పొలంలో కాల్చరాదని అన్నారు. సదస్సులో 45 మంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు