విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలి

03-11-2026 | 05:05pm

మల్లాపూర్, నవంబర్ 3 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం రాఘవపేట జెడ్పీహెచ్ఎస్‌లో(ZPHS Raghavapeta) నిర్వహించిన పాఠశాల సముదాయ సమావేశంలో ఎంఈఓ దామోదర్ రెడ్డి(MEO Damodar Reddy) పాల్గొని ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తూ ప్లాస్టిక్ రహిత పాఠశాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు