డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె

03-11-2026 | 05:11pm
  1. సమస్యల సాధన కోసం దశల వారీ పోరాటానికి సన్నద్ధమవ్వాలి
  2. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ పిలుపు
  3. మెడికల్ అధికారులకు వినతి పత్రాలను అందజేసిన సీఐటీయూ ఆశ వర్కర్స్

కొత్తగూడెం టౌన్ నవంబర్ 3 (విజయకాంతి): ఆశా వర్కర్లు(Asha Workers) తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న మెడికల్ అధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భూక్య రమేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ, పట్టణ ఆరోగ్య వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో వారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

వారి సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గత 20 ఏండ్లుగా రాష్ట్రంలో 28 వేల మంది ఆశా వర్కర్లు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ఫీల్డ్ వర్క్, ఆన్లైన్ సర్వేలు, టార్గెట్లు, డ్యూటీలు చేస్తున్నప్పటికీ కేవల చేస్తున్నప్పటికీ కేవలం రూ.9,900 లు మాత్రమే పారితోషికం ఇస్తున్నారని చెప్పారు.

ఎలాంటి ఇతర సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యా యని, హామీల అమలు కోసం కోరితే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ (ఈఎస్ఐ) సౌకర్యం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనీ డిమాండ్ చేశారు. పదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు సమ్మె వినతిపత్రం ఇవ్వాలన్నారు.

నవంబర్ 15 న జిల్లా సదస్సు నిర్వహిస్తున్నారు.

16న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తమన్నారు. 20న మంత్రులకు సమ్మె వినతిపత్రాలివ్వనున్నామని తెలిపారు. డిసెంబర్ 5 నుండి 10 వరకు అన్ని కార్పొరేషన్ లలో కార్పొరేటర్లకు, గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వినతిపత్రాలు ఇచ్చి వారి మద్దతు కుడగడతామని అన్నారు. మండలాల్లో ఎంఆర్ లకు సమ్మె నోటీస్ అందజేయాలనీ తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, ఆశ వర్కర్ యూనియన్ నాయకులు గంగా, మనీలా, రామసీత, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు