నీళ్లు లేక వాలిపోతున్న కంకులు
- తాడ్వాయిలో ఎండుతున్న పంటలు
- ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి ఖర్చు
- అది కూడా రాదేమోనని రైతుల ఆందోళన
- పరిహారం అందించి ఆదుకోవాలంటూ వేడుకోలు
తాడ్వాయి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి(Rain-deficient situation) కారణం గా రైతులు(Farmera) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలంలో(Taduvai Mandal) మొక్కజొన్న పంట సాగు(Maize crop cultivation) చేసిన రైతు ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 17 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పత్తి, సోయా, కంది, మిను ము, పెసర, వరి(Cotton, soybean, red gram, black gram, green gram, paddy) తదితర పంటలు సైతం సాగు చేశారు. గత 25 రోజుల నుంచి వర్షా లు లేకపోవడంతో నోటిదాక వచ్చిన మొక్కజొన్న పంట చేజారిపోతుంది.
మొక్కలు ఎండిపోయి కంకులు వాలిపోతున్నాయి. వర్షం లేకపోవడంతో మొక్కలకు సరిపోయేంత నీరు అందకపోవడంతో మొ క్కజొ న్న కంకులు గట్టిపడడం లేదు. - తాడువాయి మండలంలో ఇప్పటికే 6 వేల ఎకరా ల్లోని మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. మిగతా 11 వేల ఎకరాలలో సైతం కొంత పూర్తిస్థాయిలో పంట రాగా మిగతా పంట సైతం నష్టపోయే పరిస్థితిలోనే ఉంది. రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడులు పెట్టారు. కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో వేసుకున్న పత్తి పంట సైతం పూర్తిస్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితులు లేవు. పూర్తిస్థాయిలో పంట దిగుబడి వస్తే రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఆదాయం వచ్చేదని రైతులు తెలిపారు. ఒక్క తాడ్వాయి మండలంలోనే కాకుండా రాజంపేట, సదాశివనగర్, మాచారెడ్డి, లింగంపేట, మాచారెడ్డి, గాంధారి, రామారెడ్డి మండలాలలో వేసుకున్న మొక్కజొన్న పంట సైతం ఎండిపోతుంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
నోటికాడి పంట చేజారిపోయింది
మొక్క పంట నోటి దాకా వచ్చింది. వర్షం పడక పూర్తిగా ఎండిపోయింది. బాగా కష్టం ఉంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
వజ్జేపల్లి పెద్ద నరసయ్య, తాడ్వాయి
నష్టపరిహారం అందించాలి
ఆరు ఎకరాల్లో మక్క పంట వేసుకున్న. బాగా నష్టం వచ్చింది. ఎకరాకు 30 వేల పెట్టుబడి పెట్టాను. ఒక్కో ఎకరాకు 50 వేల వరకు నష్టపోయాను. ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలి, పరిహారం అందించాలి.
కురుమ రాజేందర్, దేవాయిపల్లి
పది ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా
నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. ఒక్కో ఎకరాకు రూ.25 వేల నుంచి 30 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడక పంట అంతా నష్టపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
పైడి రాజేశ్వర్‌రెడ్డి, దేవాయిపల్లి