ప్రతి కుటుంబానికి భరోసా... ఇందిరమ్మ బీమా పథకం
తాడ్వాయి, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme) అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో ఆదివారం ఇంటింటికి తిరుగుతూ ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుటుంబంలో యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఈ పథకం ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు హారాలి కిషన్ రావు, గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ్వ బీరయ్య, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, నాయకులు కొత్తోళ్ల మోహన్ గౌడ్, విడిసి అధ్యక్షులు ఏనుగు మోహన్ రెడ్డి, కందడి రాజిరెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.