కామారెడ్డిలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): నంబర్ ప్లేట్ లేని వాహనాలపై(Vehicles) పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం కామారెడ్డిలోని(Kamareddy) ప్రధాన చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు(Traffic police) వాహనాల తనిఖీలు చేపట్టారు. పట్టణ సిఐ నరహరి ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఖీలు(Police special teams) చేపట్టారు. నంబర్ ప్లేటింగ్ లేని వాహనదారులకు జరిమానాలు విధించి అక్కడికక్కడే నెంబర్ ప్లేట్లను బిగించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని వాహనదారులకు సూచించారు.