ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం డ్రైవర్ మృతి
కోదాడ (మునగాల) నవంబర్ 13(విజయ క్రాంతి):మునగాల మండల కేంద్రంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై(National Highway) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై సంజీవరెడ్డి(SI Sanjeeva Reddy) తెలిపిన వివరాల ప్రకారం మునగాల హైవేపే ఫ్లైఓవర్ పక్కన ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డీసీఎం వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, డ్రైవర్ మహబూబ్ నగర్ జిల్లా పగిడిమర్రి గ్రామానికి చెందిన బసవరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. కోదాడ ప్రభుత్వాసుపత్రికి మార్చరికి మృతదేహాన్ని తరలించామని ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.