ఎక్సైజ్ స్పెషల్ టీంల ఏర్పాటు
- జిల్లావ్యాప్తంగా కల్లు దుకాణాల ఆకస్మిక తనిఖీల కు సిద్ధం
- మూసి వేసిన కల్లు దుకాణాలు..
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కల్తీ కల్లు పై ఉక్కు పాదం మోపెందుకు ఎక్సైజ్ అధికారులు(Excise officials) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్లు దుకాణాలను ముస్తేదారులు మూసివేశారు. ప్రత్యేక ఎక్సైజ్ టీములు తనిఖీలకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న కల్లు మూస్తే దారులు కేసుల భయంతో దుకాణా లకు తాళం వేసి వెళ్ళిపోయారు.
ఎందుకు కల్లు దుకాణాలు బందు చేశారో తెలియక కల్లు ప్రియులు ఆందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలు, డిపోల వద్ద నిబంధనలు పాటించడం లేదని తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు నిబంధనలను అమలు చేసేందుకు జిల్లాలో ప్రత్యేక ఎక్సైజ్ బృందాలను ఏర్పాటు తనిఖీలకు సిద్ధమయ్యారు.
జిల్లాలోని కల్లు దుకాణాలు, డిపోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, 18 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కల్లు విక్రయించరాదని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని సిబ్బందిని ఆదేశించినట్లు వెల్లడించారు.
తనిఖీల భయం కల్లు దుకాణాలు బంద్
ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీంల తనిఖీల వార్తతో కామారెడ్డి పట్టణంలోని కల్లు విక్రయదారులు అప్రమత్తమైనట్లు కనిపించింది. శుక్రవారం పట్టణంలోని దాదాపు అన్ని కల్లు దుకాణాలు మూతపడటం చర్చనీయాంశంగా మారింది. తనిఖీలు, అధికారుల చర్యల భయంతోనే దుకాణాలు మూసివేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డిని వివరణ కోరగా, దుకాణాలు మూసివేసిన విషయం తన దృష్టికి ఇప్పటివరకు రాలేదన్నారు. వెంటనే సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి అన్ని దుకాణాల పరిస్థితిపై నివేదిక తెప్పించుకుంటానని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన లేదా ఇతర అక్రమాలు ఉన్నట్లు తేలితే సంబంధిత దుకాణాలపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.