మతసామరస్యానికి ప్రతీకగా అన్నదానం..
- భక్తులకు ముల్లాని సేవాభావం!
- ధరూర్ జాతరకు వెళ్లే భక్తులకు డీసీసీ ఉపాధ్యక్షుడు ముల్తానీ ఆధ్వర్యంలో అన్నదానం
ఝరాసంగం, నవంబర్ 13 జహీరాబాద్: విభిన్న మతాలకు నిలయమైన భారతదేశంలో మతసామరస్యం, మానవత్వం, సేవాభావమే సమాజానికి నిజమైన బలమని ఝరాసంగం మండల మచ్నుర్ గ్రామానికి చెందిన సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ(DCC Vice President Mohammad Multani) అన్నారు. భక్తి మార్గంలో నడుస్తూ దైవాన్ని కొలిచినప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.
ధరూర్ 104వ జాతరను పురస్కరించుకొని జాతరకు వెళ్లే భక్తుల కోసం మునియార్ పల్లి గ్రామం మీదుగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలినడకన, వాహనాలపై జాతరకు వెళ్తున్న భక్తులకు అన్నప్రసాదంతో పాటు మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
మతాలకు అతీతంగా భక్తులకు సేవ చేయడం ద్వారా మానవత్వం, మతసామరస్యానికి చక్కని సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో జ్యోతి నర్సింలు, ఎర్రపుల నగేష్, ఎర్ర అశోక్, ముల్ల ప్రసాంత్, గడ్డమిది అంజన్న, గణపురం రాజు, గడ్డం సుదాం తదితరులు పాల్గొన్నారు.