విద్యార్థులు క్రీడా స్ఫూర్తి తో ఆటల్లో పాల్గొనాలి
ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్ నగర్ ,నంబర్ 13 ( విజయక్రాంతి) : ఆటల్లో గెలుపు, ఓటములు ముఖ్యంకాదని , విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో(Students' Sportsmanship) ఆటలు ఆడాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(Sirpur MLA Dr. Harish Babu) అన్నారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్నగర్ పట్టణంలోని ఎస్ పి ఎం క్రీడ మైదానంలో రాష్ట్రస్థాయి అండర్ 17 కరాటే పోటీలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరితో(Sub-Collector Harsha Choudhary) కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) రాష్ట్ర కార్యదర్శి ఇందిర, కన్వీనర్ ఈశ్వర్, ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్ , వివిధ జిల్లాలకు చెందిన కోచులు, క్రీడాకారులు పాల్గొన్నారు.