పేకాట నిర్మూలనకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు

03-11-2026 | 06:06pm

24 గంటలు పేకాట నిర్వాహకులపై పోలీసుల నిఘా...

పేకాటనిర్వహించే స్థావరాలపై ఆకస్మిక దాడులు...

పేకాటకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు...

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): పేకాట ఆడి జీవితాలను చిన్న భిన్నం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) కోరారు. కామారెడ్డి జిల్లాలో పేకాట నిర్మూలనకు నాలుగు పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటలు పాటు పేకాట నిర్వాహకులపై పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. పేకాటతో జీవితాలను చిన్నాభిన్నం అవుతాయన్నారు. యువత బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని కోరారు.

పేకాట కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో పేకాట ఆడుతున్నా, నిర్వహిస్తున్నా వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం అని అన్నారు. పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించినా లేదా సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712686133 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.

మరిన్ని వార్తలు