ఎల్‌నినో ముప్పు: ఆరుతడి పంటలే దిక్కు!

28-10-2026 | 03:41pm

వరికి బదులుగా జొన్న, పొద్దుతిరుగుడు, కుసుమ సాగు చేయాలి...

మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు...

బాన్సువాడ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(impact of El Niño), నీటి లభ్యత కొరతను దృష్టిలో ఉంచుకొని రైతులు(Farmers) వరి పంటకు(Paddy crop) బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు(Kasula Balaraju) సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ చావిడి వద్ద బుధవారం రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి సాగుకు అధికంగా నీరు అవసరమయ్యే పరిస్థితుల్లో, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ జొన్న, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.

వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను అంచనా వేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో పంటలు సాగు చేస్తే రైతులకు నష్టభయాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ ఫైజుల్లా, ఏఈఓ కావ్యశ్రీతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు