కన్నారెడ్డి,అచ్చయపల్లి గ్రామాలలో భూసర్వే గ్రామసభ

12-11-2026 | 10:23pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 12 (విజయ క్రాంతి):మండలంలోని కన్నారెడ్డి,అచ్చాయీపల్లి గ్రామాలలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూసర్వే(Bhu-Bharati Land Survey) భాగంలో గ్రామాలలోని ప్రతి సర్వే నంబరు పట్టాభూమి కానీ ప్రభుత్వ భూములు కానీ గ్రామ కంఠము కానీ అన్నిటిని సర్వే చేసివారికి ల్యాండ్ ల్యాండ్ పార్సిల్ ల్యాండ్ పర్సనల్ మ్యాపు మరియు భూఆధార్ నంబరు ఇచ్చుటకులను భూసర్వే గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి గుంట ను సర్వే చేయడం కొరకు సర్వే జరిగే సమయంలో ప్రతి రైతు వారికి ఉన్న భూమిని  హద్దులు చూపించి సర్వేకు సహకరించ గలరని ఆర్డిఓ ప్రభాకర్ తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు బెస్త సాయిలు, సాయిలు,  ఆర్డీవో ప్రభాకర్,ఎల్లారెడ్డి  డిప్యూటీ సర్వేయార్  మోఏజ్,తాసిల్దార్ వెంకటరెడ్డి,సర్వేర్ గోపి, గిర్దవర్ అజయ్ కుమార్, జిపిఓలు గంగాధర్,రవీందర్, కార్యదర్శులు వెంకట్ రాములు,రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు