బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

18-11-2026 | 04:41pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 18 (విజయ క్రాంతి):మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) లిమిటెడ్ మాల్తుమ్మెద సంఘ పరిధిలోని మాల్తుమ్మెద గ్రామంలో సంఘంలో క్రాప్ లోను బండారి రుక్కవ్వ ఉన్నారు.

అయితే బండారి రుక్కవ్వ బుధవారం మరణించడంతో ఆమె మరణ ఖర్చుల కొరకు 5000 రూపాయలను మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ కళాలి సురేందర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో డైరెక్టర్లు భీమయ్య,మహేశ్వర్ రెడ్డి, యాదగిరి,సీఈఓ సందీప్ కుమార్,ఉపసర్పంచ్ శివకుమార్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు