శతాధిక వృద్ధురాలు పోచమ్మకు ఎమ్మెల్యే పోచారం నివాళులు

28-10-2026 | 03:15pm

బాన్సువాడ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో స్వర్గీయ కొత్వాల్ పోచమ్మ (శతాధిక వృద్ధురాలు) మృతి పట్ల వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కోత్వాల్ తుకారాం తల్లి అయిన పోచమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పోచమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వృద్ధురాలి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

మరిన్ని వార్తలు