ప్రభుత్వం జీవో 25ను సవరించాలి
తాడ్వాయి,(విజయక్రాంతి): ప్రభుత్వం జీవో 25ను సవరించాలని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్కర్(PRTU District President Kushalkar) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో 25ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.
పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పనిచేయడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాల నుంచి 1.5 డబ్బులు కట్ అవుతున్నట్లు ఆయన తెలిపారు.అయినా హెల్త్ కార్డులు పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ పిఆర్సి ఇవ్వలేదని, వెంటనే పిఆర్సిని అమలు చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దమ్మున్న గారి సంగారెడ్డి,మండల అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.