జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలి..
తాడ్వాయి, నవంబర్ 29 (విజయక్రాంతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఇన్చార్జి రోషిని జైస్వాల్(Roshini Jaiswal) పిలుపునిచ్చారని మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపాముల ప్రశాంత్ గౌడ్ తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చురుకుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని తెలిపారన్నారు.
ప్రతి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,నూతన పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని కోరారన్నారు. ప్రతి యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి పార్టీని మరింత పట్టిష్టపరిచేలా కృషి చేయాలని ఆమె తెలిపారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనివిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని, ఈ పథకం గొప్పతనాన్ని ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆమె కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.