కబడ్డీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థి
21-11-2026 | 05:09pm
తాడ్వాయి,నవంబర్,21( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం నందివాడ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి తాటిపాముల శత్రుజ్ఞ గౌడ్ కబడ్డీ అండర్ 14 లో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు మాధురి తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపికలో శత్రుజ్ఞ గౌడ్ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంకు పోచయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంకణాల బాల్ చంద్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.