మూకమామిడిలో జన సురక్షణపై అవగాహన

21-11-2026 | 04:56pm

ములకలపల్లి,నవంబర్ 21(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సమగ్రత(Financial Integrity) సంతృప్తి ప్రచారంలో భాగంగా ములకలపల్లి మండలంలోని(Mulakalapalli Mandal) మూకమామిడి గ్రామ పంచాయతీలో(Village Panchayat) శనివారం జన సురక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములకలపల్లి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ చావల్ల పుల్లారావు, సీఎఫ్ఎల్ కౌన్సిలర్ బాబు నవీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రతి కుటుంబానికి బీమా, పెన్షన్(Pension) అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ చావల్ల పుల్లారావు మాట్లాడుతూ జన సురక్షణ అంటేనే ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమన్నారు. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా, బీమా, పెన్షన్ ఉండాలని, అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టిందని తెలిపారు. తక్కువ ప్రీమియంతో లభించే బీమా,పెన్షన్ పథకాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేరాలని కోరారు.

సీఎఫ్ఎల్ కౌన్సిలర్ బాబు నవీన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకా చాలా మందికి బీమా,పెన్షన్ పథకాల గురించి తెలియడం లేదని,అందుకే ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జన్ ధన్ ఖాతాలు తెరవడం,పాత ఖాతాలకు రీ-కేవైసీ, సీ-కేవైసీ,నామినేషన్ నమోదు,కేసీసీ పునరుద్ధరణ,పంట బీమా దరఖాస్తుల స్వీకరణ వంటి సేవలను శిబిరంలోనే అందిస్తున్నామని చెప్పారు.బ్యాంక్ ఓటీపీ,పిన్ నంబర్ ఎవరికీ చెప్పవద్దని,ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాల్లో చేరాలని,పంచాయతీ తరఫున పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.డిసెంబర్ 31 వరకు కొనసాగే ఈ ప్రచారాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జన సురక్షణ స్కీములు అనేక విధాలుగా ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దోమల అరుణ్,గ్రామస్తులు శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు,ముత్యం భిక్షం,కోండ్ర శీను,కోర్సా వెంకటేష్,ఊకె ముత్తమ్మ,సున్నం జయ,బ్యాంక్ సిబ్బంది,సీఎఫ్ఎల్ సిబ్బంది,పంచాయతీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు