విద్యార్థులకు దుస్తుల పంపిణీ

21-11-2026 | 04:58pm

తాడ్వాయి,నవంబర్,21( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం నందివాడ ఉన్నత పాఠశాలలో(Nandiwada High School) లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్(Lions Club) ప్రతినిధులు మాట్లాడుతూ... లయన్స్ క్లబ్(Lions Club) చేస్తున్న సేవా కార్యక్రమాల్లో(Service activities) భాగంగా విద్యార్థులకు అందరికీ దుస్తులు అందించాలనే లక్ష్యంతో దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు.గ్రామంలో అందరికీ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వులిశె దామోదర్ రావు, హనుమంతరావు, సతీష్ రావు,సర్పంచ్ సంకు పోచయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంకణాల బాలచంద్రం, ప్రధానోపాధ్యాయురాలు మాధవి,నాయకులు రాజశేఖర్ రెడ్డి,భుజంగం, గణపతి రెడ్డి, హనుమారెడ్డి, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు