కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

21-11-2026 | 05:04pm

అధికారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశం

మహబూబ్‌నగర్, నవంబర్ 21 (విజయక్రాంతి): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో(Khelo India Youth Games) భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఇండోర్ స్టేడియంలో(Mahabubnagar District Indoor Stadium) డిసెంబర్ 17 నుంచి 22 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను(National-level Kabaddi competition) విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలకు(National-level competition) మహబూబ్‌నగర్ ఆతిథ్యం ఇవ్వడం జిల్లాకు గర్వకారణమన్నారు.

పోటీలకు వచ్చే క్రీడాకారులకు(Sportsmen) వసతి, భద్రత, రవాణా, భోజన సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొత్తం 16 జట్లు, ఇందులో 8 బాలికల, 8 బాలుర జట్లు పాల్గొంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Revanth Reddy) ఆహ్వానించి క్రీడలకు మరింత ప్రాధాన్యత తీసుకువస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఈ పోటీలు గొప్ప అవకాశమని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. అనంతరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, శిక్షణ కలెక్టర్ సాయి శివాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి.వెంకటేష్, డీఆర్ఓ నిర్మల, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీవైఎస్‌ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు