ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహాపాదయాత్ర
23న కరీంనగర్‌లో జరిగే యాత్రను విజయవంతం చేయాలి
హుజురాబాద్,(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియ(SIR process)పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలని బీజేపీ(BJP) నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 23న కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాపాదయాత్ర(Maha Padayatra)ను విజయవంతం చేయాలని కోరారు.
మహాపాదయాత్ర విజయవంతం కోసం బీజేపీ హుజూరాబాద్ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో శనివారంసన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సంస్థాగత రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ్ జీ, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు వాస్తవాలను వివరించి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 23న కరీంనగర్‌లో జరిగే మహాపాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొననున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. హుజూరాబాద్ పట్టణ, మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి యాత్రను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మండల అధ్యక్షుడు పారుపల్లి కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ అధ్యక్షులు, జిల్లా, పట్టణ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.