ఘనంగా శివాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

21-11-2026 | 05:06pm

హన్వాడ : మండల పరిధిలోని షేక్‌పల్లి గ్రామంలోని(Shekpalli Village) శ్రీ శివాంజనేయ స్వామి ఆలయంలో(Shivanjaneya Swamy Temple) నిర్వహించిన దేవతామూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా భక్తిశ్రద్ధలతో(devotional) ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, సర్పంచ్ బొట్టు శ్రీను, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు