పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి
21-11-2026 | 04:58pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. శుక్రవారం పెండింగ్ కేసుల పరిష్కారం పై కోర్టు ఆవరణలో పోలీస్ సిబ్బంది న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కోర్టు విచారణలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాధిక భవిష్య ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.