ఇందిరమ్మ జీవిత బీమా.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ధీమా
చెన్నూర్ ,(విజయక్రాంతి): ప్రతి కుటుంబానికి ఆర్థిక ధీమా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) ప్రవేశపెట్టిందని చెన్నూర్ మున్సిపాలిటీ(Chennur Municipality) చైర్పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్ అన్నారు.ఈ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ మున్సిపాలిటీ 2వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కమీషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్ సుద్దపల్లి సునీత సుశీల్ కుమార్ తో కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.
కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా విపత్కర పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.కుల,మత, వర్గ,లింగ వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే గొప్ప పథకం ప్రయోజనాన్ని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. చెన్నూర్ పట్టణంలోనీ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పథకం వివరాలను తెలియచేయాలని కోరారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం ప్రయోజనం పొందేలా ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి మహేష్ ,కో ఆప్షన్ సభ్యులు, సాధన బోయిన కృష్ణ,సయ్యద్ సాహిర్, మధున పోచమ్మ గుడి చైర్మన్ తనుగుల సతీష్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తుల సమ్మయ్య , రాంలాల్ గిల్డ్ , చింతల శ్రీనివాస్, ఎండి బషీర్ , ఎండి అమీర్, సుంకరి సంతోష్,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు పెండ్యాల, ఎండి ఇబ్రాహీం షరీఫ్,శ్రీకాంత్,తగరం కృష్ణ, ఎండి అన్వర్ , ఎండి సుల్తాన్,చెన్న వెంకటేష్,కోమటి పల్లి రమేష్, వసీం, అతిఫ్, గుండేటి మధుకర్,మహబూబ్, లీలా, నెన్నెల భీమన్న తదితరులు పాల్గొన్నారు.