పేద కుటుంబాలకు భరోసా.. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం

21-11-2026 | 05:03pm

అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

ఆలేరు,(విజయక్రాంతి): పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం(Indiramma Family Insurance Scheme) పేదోళ్ల పాలిట వరమని భువనగిరి 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్(Councilor Jaligam Vignesh) అన్నారు. శనివారం భువనగిరి(Bhuvanagiri) పట్టణంలోని 22వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ఆయన ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా పథకం ద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఇందిరానగర్‌లోని కమ్యూనిటీ హాలులో అధికారులు అందుబాటులో ఉండి అర్హుల వివరాలను నమోదు చేస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీకాంత్, ప్రణయ్, శ్రీధర్, నాయకులు సళ్ళ యాదగిరి, మహేందర్, బిక్షపతి, శివతేజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు