పేకాట రాయుళ్లపై దాడి

05-11-2026 | 11:30pm

ఆరుగురి పట్టివేత

నగదు,మొబైల్ ఫోన్లు స్వాధీనం

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామ శివారులో దేమే గేట్ సమీపంలో గురువారం పేకాట(Gambling ) ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పక్కాగా దాడి చేసి  వారిని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న వారిలో బ్రహ్మానంద రెడ్డి, ఆటనాల శంకర్, బోండ్ల మైసయ్య, గాదె వెంకటి, జంగంపల్లి రాజా గౌడ్, కొండపురం ప్రభులింగం లు ఉన్నట్లు ఆయన తెలిపారు.

వారి నుంచి రూ.31,840 నగదు,ఏడు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, 52 పేకాట కార్డు లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు డబ్బులు పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్న సమయంలోనే పట్టుకొని పేక కార్డు లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

మరిన్ని వార్తలు