పార్టీ పటిష్టం కోసం యువకులు సైనికుల్లా పని చేయాలి..
తాడ్వాయి, నవంబర్ 29 (విజయక్రాంతి): పార్టీ పటిష్టం కోసం యువకులు సైనికుల్లా పని చేయాలని బీజేవైఎం తాడ్వాయి మండల(Tadwai Mandal) శాఖ అధ్యక్షులు రెడ్డి గారి తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో ఆదివారం బిజెపి యూత్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో యువ మోర్చాతో పాటు అన్ని గ్రామ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు.ప్రతి బిజెపి కార్యకర్త సనాతన ధర్మాన్ని రక్షించడంతో పాటు రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు గుండ్రెడ్డి రాజిరెడ్డి, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.