శిశు మందిర్లో విభాగ్ స్థాయి సమావేశాలు
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్( Sri Saraswati Shishu Mandir) ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విభాగ్ స్థాయి సమావేశాలు గురువారం నిర్వహించారు. ఈ సమావేశాలకు దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి పాల్గొని సమావేశంలో విద్యా సంబంధిత అంశాలు, విద్యార్థుల సమగ్ర వికాసం, ఆచార్యుల బాధ్యతలు, పాఠశాలల అభివృద్ధి తదితర విషయాలపై విలువైన మార్గదర్శనం చేశారు. అదే విధంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) సమావేశంలో పాల్గొన్నారు.
విద్యావేత్తలతో చర్చించి విలువైన సూచనలు చేస్తూ, విద్యార్థుల్లో విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి సద్గుణాలను పెంపొందించడంలో శిశు మందిర్ విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోర రణధీర్, ముక్కాల సీతారాములు, పాక సత్యనారాయణ, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, తేళ్ల రాజమౌళి, ఎలగందుల సత్యనారాయణ, బండారి కరుణాకర్, సాంబ శివరావు, కాటం రవీందర్ మరియు వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఆచార్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.