ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

18-11-2026 | 01:59pm

రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం: తూర్పాటి రాజు

హుజూరాబాద్,(విజయక్రాంతి): హుజూరాబాద్ మండలం(Huzurabad Mandal)లో ధాన్యం కొనుగోలు కేంద్రాల(Paddy Procurement Centers)ను వెంటనే ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, తహసీల్దార్ నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం తడిసిపోకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, ఇతర సౌకర్యాలు కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రావుల వేణు, నాయకులు గంగిశెట్టి రాజు, తిప్పబత్తిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, ఎర్ర శ్రీధర్, కొలిపాక వెంకటేష్, గుర్రం సంతోష్, కొడిమ్యాల పవన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు