అల్పాహార భరోసా

18-11-2026 | 01:38pm

చదువులో సత్తా చాటండి.. బహుమతులు పట్టండి – మంత్రి వివేక్

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మోడల్ స్కూల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఆయన ఆహార నాణ్యతను పరిశీలించారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు హాజరు శాతం, చదువుపై ఏకాగ్రత పెంచడమే ఈ పథకం లక్ష్యమన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తానని ప్రకటించారు. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. చెన్నూరు నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు