ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సుదగాని మల్లేశ్ గౌడ్

18-11-2026 | 01:53pm

వైస్ చైర్మన్‌గా ఎంఏ ఎజాజ్‌కు అవకాశం

18 మందితో పాలకవర్గం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

బీసీ జనరల్‌కు రిజర్వ్ చేసిన చైర్మన్ పదవి.. రెండేళ్ల పాటు పదవీకాలం

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ(Aler Agricultural Market Committee) నూతన పాలకవర్గం ఏర్పాటైంది. మార్కెట్ కమిటీ ఏడో పాలకవర్గం చైర్మన్‌గా సుదగాని మల్లేశ్ గౌడ్, వైస్ చైర్మన్‌గా ఎం.ఏ. ఎజాజ్‌ను ప్రతిపాదిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 811ను నవంబర్ 17, 2026న విడుదల చేసింది.

చైర్మన్ పదవిని బీసీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మొత్తం 18 మందికి అవకాశం కల్పించింది. వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 16 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పాలకవర్గం పదవీకాలం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు కొనసాగనుంది. లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటుంది. అయితే నియామకాలు హైదరాబాద్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ధ్రువీకరణకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పాలకవర్గంలో సభ్యుల వివరాలు: సుదగాని మల్లేశ్ గౌడ్ – చైర్మన్, ఎం.ఏ. ఎజాజ్ – వైస్ చైర్మన్, సభ్యులు గా సగ్గు కిష్టయ్య, కుళ్ల సిద్ధులు, పండు రాజు బాలయ్య, దిద్దిగ రమేష్, మడోతు సుధాకర్, గడ్డమీది నిఖిల్ గౌడ్, సుడుగు జీవన్ రెడ్డి, అగ్గిడి మల్లయ్య, బొట కవిత – సభ్యురాలు బెజుగం రాజేశ్వర్, సముద్రాల సత్యనారాయణ, ఈ. మల్లేష్, తుర్కపల్లి పీఏసీఎస్ చైర్మన్ – సభ్యుడు, జిల్లా మార్కెటింగ్ అధికారి, యాదాద్రి భువనగిరి – సభ్యుడు ఆలేరు వ్యవసాయ సహాయ సంచాలకులు – సభ్యుడు, గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ – సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పేరు మీద వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన పాలకవర్గం ఏర్పాటుతో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలకు కొత్త నాయకత్వం అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు