మభ్యపెట్టి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్

18-11-2026 | 05:35am
  1. మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
  2. గోదావరి, కృష్ణ నీరు తరలించింది నిజం
  3. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
  4. అంబేద్కర్ సిద్దాంతం ఆచరిస్తుంది బీఆర్‌ఎస్
  5. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఎన్నికలకు(Elections) ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను మభ్యపెట్టేందుకే అని తేలిపోయిందని బీఆర్‌ఎస్ నేత(BRS leader), మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిక్లరేషన్ పేరుతో(Declaration Name) రైతులు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసిందని మండిపడ్డారు. తులం బంగారం, పింఛన్ల పెంపు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.

రైతులకు రుణమాఫి, రైతుబంధు, ఉచిత విద్యుత్, నిరంతర నీటి సరఫరా వంటి హామీలతో గద్దెనెక్కి ప్రజల గొంతు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సరిగ్గా మూడేళ్ల క్రితం నవంబర్ 17న మేనిఫెస్టోను విడుదల చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు నవంబర్ 17ను బ్లాక్ డేగా మార్చారని దుయ్యబట్టారు. అభయహస్తం పేరుతో భస్మాసుర హస్తం అందించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రానీయొద్దని, కేసీఆర్‌ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ గోదావరి, కృష్ణా జలాలు తరలించారనేది నూటికి నూరుపాళ్లు నిజమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని బీఆర్‌ఎస్ పాటిస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, మెతుకు ఆనంద్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు