ఇటలీ నేతతో తిట్టించారు

18-11-2026 | 05:25am
  1. రాహుల్, రేవంత్ దేశద్రోహులే
  2. దేశ ప్రజలకు ఇద్దరూ క్షమాపణలు చెప్పాల్సిందే
  3. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌తో(Italian leader Giacomo Filibeck) మన దేశాన్ని తిట్టించిన ఈ దుర్మార్గపు చర్య వెనకున్న మాస్టర్ మైండ్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)దేనని, ఫిలిబెక్ మాట్లాడిన అంశాల స్క్రిప్ట్ రైటర్ కూడా సీఎం రేవంత్ రెడ్డియేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేటీ మాట్లాడారు.

ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టను దిగజార్చే కుట్రలకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముమ్మాటికీ దేశ ద్రేహులేనని, భారత్ వ్యతిరేక సమ్మిట్ నిర్వహించినందుకు వారిద్దరు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓట్ చోర్ -గద్దీ చోడ్’ అంటూ నినాదాలు చేయడం మన భారతదేశ సార్వభౌమాధికారానికి, ప్రతిష్టకు భంగం కలిగించే చర్యనే అన్నారు.

ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీ, తన అమ్మ సోనియా పుట్టిన దేశమైన ఇటలీ నుంచి ఒక పనికిమాలిన నేతను పిలిపించి, తనను ప్రతిపక్షనేతగా ఎన్నుకున్న వ్యవస్థను దూషించేలా మాట్లాడించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వరుస ఓటములతో రాహుల్ గాంధీ మతిస్థిమితం కోల్పోయారన్నారు. కాంగ్రెస్‌కు సీఎం రేవంత్ ఇప్పటివరకు మూడువేల కోట్ల రూపాయలు ముట్టజెప్పారని నేతలు ఆరోపిస్తున్నారని విమర్శిం చారు. ఫిలిబెక్ దేశంలోకి రాకుండా సీఎం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు