గుండి గ్రామంలో చేయూత పింఛన్ల పంపిణీ

18-11-2026 | 01:34pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మండలంలోని గుండి గ్రామం(Gundi Village)లో సర్పంచ్ జబరి రవీందర్ అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్లను పంపిణీ(Cheyutha Pensions Distribution) చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుళ్ల మంగ హాజరై పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ... అర్హులైన వృద్ధులకు సైతం వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, ఏఎంసీ డైరెక్టర్ విశ్వనాథ్, వార్డు సభ్యులు రాజు, తిరుపతి, ప్రవీణ్, రాజేష్, బిజ్జుబాయి, వీఓ అధ్యక్షురాలు స్వప్న, మాజీ సర్పంచ్ దత్తు, శ్యాంరావు, మల్లేశ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు