రెచ్చిపోయిన ఇసుక మాఫియా

18-11-2026 | 02:02pm

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయి కానిస్టేబుల్ కు వాహనం ఢీకొట్టు చంపబోయింది. మండలంలోనీ లింగన్నపేట గ్రామంలో అక్రమ ఇసుక రవాణా నిరోధించే క్రమంలో జరిగిన ప్రమాదంలో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ఆకుల రమేష్‌(Blue Court Constable Akula Ramesh)కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట మండలం నుంచి గంభీరావుపేట మండలం లింగన్నపేటకు బొలెరో గూడ్స్ వాహనంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం మేరకు, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్స్ ఆకుల రమేష్, హోంగార్డ్ మైపాల్ ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

లింగన్నపేటలో ఇసుకను ఖాళీ చేసి అర్ధరాత్రి తిరిగి వస్తున్న ఆ వాహనాన్ని పోలీసులు నిలువరించేందుకు యత్నించగా, డ్రైవర్ వారిపైకి వాహనాన్ని దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆకుల రమేష్‌ను బొలెరో గూడ్స్ ఢీకొట్టడంతో పాటు, ఆయన చేతి మరియు కాలుపై నుంచి వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన రమేష్ ను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలించారు.

మరిన్ని వార్తలు