మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

18-11-2026 | 01:31pm

చెన్నూర్,( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) చెన్నూరు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక ఉపాధి ,మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkatswamy) అన్నారు.నియోజకవర్గ ఎమ్మెల్యేగా  చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. బుధవారం చెన్నూర్ మండలంలోని  కన్నేపల్లి నుండి సంకారం, బుద్దారం గ్రామాల మధ్య రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  మంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న కన్నేపల్లి, సంకారం బుద్దారం గ్రామస్తుల కష్టాలకు ఈ రోడ్డు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు,గ్రామస్తులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు