ఎగువ మానేరు నీటిని విడుదల చేయాలని ఆందోళన
కామారెడ్డి-సిద్దిపేట రహదారిపై బీజేపీ ధర్నా
గంభీరావుపేట,(విజయక్రాంతి): యాసంగి వరి సాగు(Yasangi Paddy Crop) కోసం ఎగువ మానేరు జలాశయంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట మండలంలోని నిండుగా ఉన్న చెరువుల నుంచి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు, బీజేపీ నాయకులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కామారెడ్డి-సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
సాగునీరు విడుదల చేయని పక్షంలో గంభీరావుపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. అలాగే పంట రుణాల చెల్లింపులకు గడువు కల్పించాలని, మండలంలోని అన్ని గ్రామాల్లో సాగునీటి అవసరాలు, చెరువుల నీటి నిల్వలపై ప్రత్యేక బృందంతో సర్వే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నా దగ్గరకి తహసీల్దార్ మారుతీ రెడ్డి, ఎస్ఐ బాలరాజు చేరుకొని వారిని సముదాయించారు. నీటిని విడుదల చేయాలనీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ నాయకులుదార్మిక సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిలు తోట్ల మల్లేష్ యాదవ్, విఘ్నేష్ గౌడ్, గంట అశోక్,బండ దేవయ్య, సర్వోత్తం, నర్సింలు, గణేష్ రెడ్డి, దుర్గేష్ యాదవ్, ఆంజనేయులు, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.